మా నాన్నకు ఎంగేజిమెంట్ అయ్యింది!

26 Feb, 2016 10:48 IST|Sakshi
మా నాన్నకు ఎంగేజిమెంట్ అయ్యింది!

యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ సంగతి ఏమో గానీ.. అతడి తండ్రికి మాత్రం ఇప్పుడు మళ్లీ పెళ్లవుతోంది. ఎంతోకాలంగా తాను ప్రేమిస్తున్న చెల్సీ రెబెలో (28) అనే అమ్మాయితో బీబర్ తండ్రి జెరెమీ ఎంగేజిమెంట్ అయ్యింది. గత వారం సెయింట్ బార్ట్స్ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు జెరెమీ ఆమెకు ప్రపోజ్ చేశారు. తామిద్దరికీ ఎంగేజిమెంట్ అయ్యిందన్న విషయాన్ని ఆయన నిర్ధారించారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మోకాళ్ల మీద కూర్చుని రెబెలోకు వెడ్డింగ్ రింగ్ అందిస్తున్న ఫొటో కూడా పెట్టారు. చెల్సీ రెబెలోతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని రాశారు. జస్టిన్ బీబర్ పుట్టిన పది నెలలకే అతడి తల్లి పేటీ మాలెట్‌తో తనకున్న ఐదేళ్ల బంధాన్ని జెరెమీ తెంచుకున్నారు. ఆయనకు తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎరిన్ వాగ్నర్‌తో మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు