సైక్లిస్టును ఢీ కొట్టిన కంగారూ..!!

29 Jan, 2018 17:51 IST|Sakshi
సైక్లిస్టును ఢీ కొట్టిన అనంతరం పారిపోతున్న కంగారూ

క్వీన్స్‌లాండ్‌, ఆస్ట్రేలియా : సహ రైడర్ల కంటే ముందుగా వెళ్తున్న ఓ సైక్లిస్టును కంగారూ ఢీ కొట్టిన ఘటన క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగింది. దీంతో సైక్లిస్టు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కంగారూ బలంగా తాకడంతో ఆమె భుజం ఒక వైపునకు జరిగింది.

అయితే, ఈ ప్రమాదంలో కంగారూకు ఎలాంటి గాయాలు కాలేదు. సైక్లిస్టును ఢీ కొట్టిన అనంతరం భారీ జంప్‌లతో ఆ ప్రాంతం నుంచి పరారైంది. వేగంగా వెళ్తుండటం వల్ల కంగారూ నుంచి తప్పుకోలేకపోయినట్లు ప్రమాదంలో గాయపడిన రెబకా చెప్పారు.

మరిన్ని వార్తలు