ప్రాణాలు కోల్పోతున్న కంగారూలు!

12 Jul, 2016 09:35 IST|Sakshi

కాన్బెర్రా: ఆస్ట్రేలియా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కంగారూ. అటువంటిది ఇప్పుడా జంతువులకు అక్కడ రక్షణ లేకుండా పోతోంది. మిగిలిన జంతువులతో పోలిస్తే కంగారూలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు స్థానిక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించిన తాజా వివరాలను బట్టి తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ జంతువు కంగారూలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  ఆస్ట్రేలియాలోని ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన గణాంకాలను బట్టి, మిగిలిన జంతువులతో పోలిస్తే పదిలో తొమ్మిది కంగారూలు రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నట్లు స్థానిక జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రమాదాల్లో  2015 లో జరిగిన దాదాపు 20,000 రోడ్డు ప్రమాదాలను విశ్లేషించగా కంగారూలు 88 శాతం, వల్లబీస్ 6 శాతం, వోమ్బాట్స్ 3 శాతం, శునకాలు 2 శాతం చనిపోతున్నట్లు ఏఏఎమ్ ఐ నివేదికల్లో తెలిపింది. దేశంలో మొత్తం కంగారూల సంఖ్య 30 నుంచి 60 మిలియన్ల మధ్య ఉంటుంది.

ఆస్ట్రేలియాలో మాత్రమే అత్యధికంగా కనిపించే జంతువైన కంగారూ... ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అడవుల్లోనూ నివసిస్తూ...  తన పిల్లలను పొట్టకింది భాగంలో ఉండే సంచిలో పెట్టుకొని ఒక చోటునుంచీ మరోచోటుకు  గెంతుకుంటూ వెడుతుంటుంది. అయితే జూన్, ఆగస్టు మధ్య, శీతాకాలంలో ఈ కంగారూలు 68 శాతం  రోడ్లను దాటుతుంటాయని, అదే సమయంలో గరిష్టస్థాయిలో ప్రమాదాలకు గురౌతున్నాయని ఏఏఎమ్ఐ ప్రతినిధి మైఖేల్ మిల్స్ తెలిపారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండి, రోడ్లు చీకటిగా, సరిగా కనిపించకుండా ఉండటం కూడ ఈ సమయంలో రోడ్లపై వెళ్ళే జంతువులు ఎక్కువ ప్రమాదాలకు గురౌతున్నట్లు మైఖేల్ చెప్పారు.

రోడ్లకు అడ్డుగా వచ్చే జంతువుల వల్ల ప్రమాదాలు జరగడంతో ఆయా జంతువులు చనిపోవడం, లేదా తీవ్రంగా గాయపడటంతోపాటు, డ్రైవర్లకు కూడా ప్రమాదంగానే మారిందని, ఒక్కోసారి డ్రైవర్లూ, జంతువులు సైతం చనిపోయిన సందర్భాలుంటాయని మైఖేల్ చెప్తున్నారు. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ క్వీన్ బెయాన్.. ఆస్ల్రేలియాలోనే రోడ్డు ప్రమాదాలకు రాజధానిగా, ప్రత్యేక గుర్తుగా మారుతోందని ఏఏఎమ్ ఐ విశ్లేషించింది. దీంతోపాటు విక్టోరియన్ నగరం బెండిగో, క్వీన్స్ ల్యాండ్ పట్టణం డింగో, న్యూ సౌత్ వేల్స్ పట్టణం సింగిల్టన్, గౌల్ బర్న్ నగరాలైన మొత్తం ఐదు ప్రముఖ ప్రాంతాలు దేశంలోనే జంతు ప్రమాదాలకు నెలవులుగా పరిణమించినట్లు ఏఏఎమ్ఐ నివేదికల్లో తెలిపింది.

మరిన్ని వార్తలు