మోదీని కలిసిన కశ్మీరీ పండిట్లు

22 Sep, 2019 09:27 IST|Sakshi

హోస్టన్‌ : అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కశ్మీరీ పండిట్లు కలిశారు. ఆదివారం హోస్టన్‌లో మోదీతో కశ్మీరీ పండిట్లు సమావేశమైన సందర్భంగా నూతన కశ్మీర్‌ ఆవిర్భావానికి తాము బాసటగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మనందరం నవ కశ్మీర్‌ నిర్మాణం చేపట్టాలని ప్రధాని మోదీ కశ్మీరీ పండిట్లతో అన్నారు. ప్రధాని మోదీతో భేటీ వివరాలను కశ్మీరీ పండిట్‌ సురీందర్‌ కౌల్‌ వివరిస్తూ ప్రధాని మోదీకి తామంతా అండగా నిలుస్తామని చెప్పామని అన్నారు. కశ్మీరీ పండిట్ల తరపున ఆయనకు వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌ ప్రగతికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక నిర్ణయం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది కశ్మీరీ పండిట్ల తరపన ధన్యవాదాలు తెలిపామని వెల్లడించారు. కశ్మీర్‌ను శాంతియుత ప్రాంతంగా మలిచి అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే ప్రధాని కల నెరవేరేందుకు తాము సహకరిస్తామని మోదీకి హామీ ఇచ్చామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు