బ్రిటన్ రాజవంశంలో 'రాయల్ బేబీ'!

23 Jul, 2013 11:52 IST|Sakshi
బ్రిటన్ రాజవంశంలో 'రాయల్ బేబీ' జననం!

బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌విలియమ్, ఆయన భార్య కేట్ మిడల్టన్‌లకు పుట్టబోయే పాపాయి గురించి యూకే పరిధిలో ఎన్నడూ లేనంతగా హాట్ టాపిక్ అయ్యింది. రాయల్ బేబీగా వ్యావహారికంలో ఉన్న ఈ చైల్డ్ కోసం బ్రిటిష్ ప్రజలు వేయికళ్లతో ఎదురుచూసిన నిరీక్షణ, ఉత్కంఠకు సోమవారం సాయంత్రం తెరపడింది. పుట్టబోయే బిడ్డపేరుపై జరిగిన చర్చకు తుది రూపం దక్కింది. బేబీ పేరు గురించి జరిగిన బెట్టింగులు ప్రధానంగా రెండు పేర్లమీద నిలబడిన సంగతి తెలిసిందే. కేట్‌కు పుట్టబోయేది ఆడపిల్ల అయితే ఆ పాప పేరు ‘అలెగ్జాండ్రా’ అని మగపిల్లవాడైతే ఆ బాబు పేరు ‘జార్జ్’ అవుతుందని బెట్టింగ్‌రాయుళ్లు అంచనా వేసిన నేపథ్యంలో బ్రిటన్‌ రాజవంశంలో మూడో తరం వారసుడికి యువరాణి కేట్‌మిడిల్‌టన్‌ జన్మనిచ్చింది.

బ్రిటన్ రాజవంశంలో భవిష్యత్ రాజు జన్మించారనే వార్తలతో రాజకుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజకుటుంబాన్ని అభినందనలు, సందేశాలు ముంచెత్తాయి. సోమవారం సాయంత్రం 4.24 నిమిషాలకు మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, బరువు 3.8 కిలోలు ఉన్నట్టు ఓ ప్రకటనలో బ్రిటిష్ రాజభవనం అధికారులు వెల్లడించారు. మగ బిడ్డకు సినా నురు అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.

బ్రిటన్ ప్రధాన మంత్రి కామెరూన్ ఈ వార్తను సామాజిక వెబ్ సైట్ ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. 'బ్రిటన్ రాజవంశంలో భవిష్యత్ రాజు జన్మించారనే వార్త ఆనందం కలిగించింది. ఈ రోజు దేశం మొత్తానికి పండగలాంటి రోజు. వారు మంచి తల్లితండ్రులవుతారు' అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాక కేట్, విలియమ్‌లకు ఆడపిల్లపుడితే ఆమె కామన్‌వెల్త్ దేశాలకు మహారాణి అవుతుందని బ్రిటన్ ప్రధాని కామెరూన్ వ్యాఖ్యానించారు. తనకు మనవడు పుట్టారనే వార్తతో  ప్రిన్స్ చార్లెస్ దంపతులు ఆనందంతో తబ్బిఉబ్బియ్యారు.

ప్రిన్స్ ఆఫ్ క్రేంబిడ్జి విలియమ్ దంపతులకు ఇదే తొలి సంతానం.  సోమవారం ఉదయం 6 గంటలకు డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రిన్స్ విలియం వెంట రాగా కేట్ మిడిల్ టన్ ను పాడింగ్టన్ లోని సెయింట్ మేరీస్ హస్పిటల్ లో చేర్పించినట్టు డెయిల్ మెయిల్ పత్రికకు అధికారులు వెల్లడించారు. ఇదే అస్పత్రిలో ప్రిన్సెస్ డయానా తన ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. కేట్ మిడిల్ టన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, సాధారణ జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.  ఇక రాయల్ బేబీ జననం గురించి సమాచారం అందివ్వడం గురించి ఇంగ్లండ్ మీడియా నిరంతర వార్తాస్రవంతిగా మారింది. సాధారణ పౌరులు రోడ్ల వెంబడి విలియమ్, కేట్‌లకు ‘ఆల్ ది బెస్ట్’ ‘మీరే మా గర్వకారణం’ అంటూ ప్లకార్డ్‌లు ప్రదర్శిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంతంలో మీడియా, ప్రజలతో కిక్కిరిసిపోయింది.

మరిన్ని వార్తలు