'మా అమ్మాయికి బట్టలు దాచిపెడుతున్నా'

29 Jun, 2016 12:23 IST|Sakshi
'మా అమ్మాయికి బట్టలు దాచిపెడుతున్నా'

లాస్ ఎంజెల్స్: తన కూతురు కోసం ఇప్పటి నుంచే తాను ధరించిన దుస్తుల్లో మంచివాటిని దాచి పెడుతున్నట్లు హాలీవుడ్ ప్రముఖ సూపర్ మోడల్ కేట్ మాస్ ఓ మేగజిన్కు తెలిపింది. ఆమె ప్రస్తుతం పద్నాలుగేళ్ల కూతురు ఉంది. ఆ అమ్మాయి కూడా ఫ్యాషన్ రంగంపైనే మక్కువ చూపుతుండటంతో తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ వస్త్రాలను తన కూతురు లిలా గ్రేస్ కోసం ఇక దాచిపెడుతుందంట. ఇప్పటికే కుప్పల్లో వాటిని పోగేసినట్లు ఆమె తెలిపింది.

'నేను ఫ్యాషన్ షూటింగ్లో పాల్గొనే సమయంలో ఎన్నో విలువైన ఫ్యాషన్ పీస్ లను ధరించేదాన్ని. వాటన్నంటిని నా స్నేహితులకు ఇచ్చేదాన్ని. మరికొన్ని పోగొట్టుకునేదాన్ని. మా అమ్మాయికి పద్నాలుగేళ్లు వచ్చాయి. తను కూడా ఫ్యాషన్ రంగంపై మక్కువ చూపుతోంది. అందుకే అప్పటిలాగా కాకుండా ఇప్పుడు మరింత శ్రద్ధ పెట్టాను. నా కూతురు కోసం వాటిల్లో మంచివాటిని ఎంపికచేసి దాచి పెడుతున్నాను' అని ఆమె తెలిపింది.

మరిన్ని వార్తలు