కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ

27 Oct, 2016 08:23 IST|Sakshi
కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ

నెవెడా: తన కుటుంబం కోసం ఓ అమెరికా యువతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తనవాళ్లను కాపాడుకునేందుకు కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. 21 ఏళ్ల కేథరిన్ స్టోన్ అనే యువతి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నెవెడాలో చట్టబద్దంగా పనిచేస్తున్న వేశ్యాగృహం 'కిట్ కాట్ రాంచ్'లో ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ఆమె నిర్ణయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అత్యధికంగా 4 లక్షల డాలర్లు(సుమారు రూ. 2.6 కోట్లు) బిడ్ వచ్చింది.

లాయర్ కావాలనున్న కేథరిన్ స్టోన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కన్నీటి గాథ ఉంది. సీటెల్ లో సంతోషంగా జీవిస్తున్న ఆమె కుటుంబాన్ని అగ్నిప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. 2014, డిసెంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ అగ్నిప్రమాదం ఆమె కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తమ ఇంటికి బీమా లేకపోవడంతో వారికి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. దీంతో కేథరిన్ కుటుంబం 8 నెలల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఎలాగైనా తన కుటుంబానికి ఆసరాగా నిలబడాలనుకున్న ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాలేజీ ఫీజు కోసం ఓ యువతి 2008లో తన కన్యత్వాన్ని వేలం పెట్టిందన్న విషయం తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేసింది. కేథరీన్ కన్నీటి గాథను 'దిజ్ ఈజ్ ద లైఫ్' పేరిట సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది.

నెవెడాలో వ్యభిచారం చట్టబద్దమని తెలుసుకుని కిట్ కాట్ రాంచ్ యజమాని డెన్నిస్ హొఫ్ ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించినట్టు కేథరీన్ తెలిపింది. తన కుటుంబ పరిస్థితి గురించి వివరించడంతో తనకు సాయం చేసేందుకు డెన్నిస్ ఒప్పుకున్నారని వెల్లడించింది. తర్వాత తన తల్లితో పాటు వెళ్లి డెన్నిస్ ను కలిసింది. మే నెలలో నెవెడాకు కేథరీన్ వచ్చింది. సర్వం కోల్పోయి రోడ్డున పడిన తన వాళ్లకు ఊతం ఇవ్వడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని కేథరీన్ స్పష్టం చేసింది. వేలానికి మరన్ని బిడ్స్ వస్తాయన్న ఆశాభావంతో ఉంది. కాగా, చాలా మంది కేథరీన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను పరుష పదజాలంతో తిట్టిపోశారు. సానుభూతిపరులు మాత్రం ఆమె అడ్డుకోవద్దని అంటున్నారు.

మరిన్ని వార్తలు