'మా ఆయనంటే వందశాతం నమ్మకం'

5 Oct, 2015 10:21 IST|Sakshi
'మా ఆయనంటే వందశాతం నమ్మకం'

లండన్: తన భర్త తప్పు చేసినా అతడిపై ఏ మాత్రం విశ్వాసం సన్నగిల్లలేదని ప్రముఖ హాలీవుడ్ సింగర్, మోడల్ కాతీ ప్రైస్ అంటోంది. అతడు ఎలాంటి పనులు చేసినా చివరికి తన వద్దకే వస్తాడని, తన ఇంటి చుట్టే తిరుగుతాడని, తానంటే అతడికి చెప్పలేనంత ప్రేమ అని చెప్తోంది. 38 సంవత్సరాల కాతీ ప్రైస్ వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన కైరాన్ హేలర్ను 2013లో వివాహం చేసుకుంది. అంతకుముందే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయి.

పీటర్ ఆండ్రే అనే వ్యక్తిని ఆమె 2005లో వివాహం చేసుకోగా వారి దాంపత్యం 2009కే ముక్కలైంది. అనంతరం అలెక్స్ రైడ్ అనే వ్యక్తిని 2010లో వివాహం చేసుకోగా ఆ బంధం కూడా రెండేళ్లపాటే కొనసాగింది. దీంతో 2013లె ఆయు కైరాన్ హేలర్ ను వివాహం చేసుకుంది. అయితే, అతడు ఇటీవల కాతీ స్నేహితురాలైన జేన్ పాట్నీతో అతడు వివాహేతర సంబంధం పెట్టకొని రెడ్ హ్యాండెడ్గా కాతికి దొరికిపోయాడు. ఈ విషయం బయటకు తెలిసి నానా రకాలుగా విమర్శలు వచ్చాయి.

అయితే, ఆ విమర్శలను పక్కకు పెడితే తన భర్తను వెనకేసుకొచ్చింది కాతీ. 'అందరూ కైరాన్ తప్పుచేశాడని, మోసగాడని, అబద్ధాల కోరని అంటున్నారు. కానీ నేను మాత్రం ఓ కరడుగట్టిన న్యాయమూర్తిలాంటిదాన్ని. అలాంటి విషయాలు పట్టించుకోను. అతడు ఏం మారిపోయాడో నాకే తెలుసు. అతడిని నేను వందశాతం నమ్ముతా' అంటూ కాతీ పేర్కొందని ఓ మ్యాగజైన్ తెలిపింది. తనను తాను తెలుసుకున్న కైరాన్ ప్రస్తుతం బుద్ధిగా ఉంటున్నాడని, తనకు తాను తన పిల్లలు తప్ప మరే లోకం లేదని ఆమె చెప్పినట్లు వివరించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు