అక్కడి కార్యాలయాల్లో స్మార్ట్ఫోన్లు నిషేధం

19 Mar, 2016 12:24 IST|Sakshi
అక్కడి కార్యాలయాల్లో స్మార్ట్ఫోన్లు నిషేధం

సిడ్నీ: ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నారా ? అయితే మీరు మీ వెంట స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లకండి. ఒకవేళ తీసుకెళ్తే  రిసెప్షన్ కౌంటర్ వద్దే వదిలివెళ్లాల్సి ఉంటుంది. ఇది కేవలం సామాన్య వ్యక్తులకు మాత్రమే కాదు, అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఖజకిస్తాన్లోని సిడ్నీలో ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా స్మార్ట్ఫోన్లను నిషేధించారు. ఈ నిషేధం మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది.

ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాలు తరుచూ బయటకు లీకు అవుతున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఖజికిస్తాన్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు స్మార్ట్ఫోన్లకు బదులు సాధారణ ఫోన్లు (కెమెరా, ఇంటర్నెట్ సౌకర్యం లేని) ను మాత్రమే ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది.

మరిన్ని వార్తలు