అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్

2 Sep, 2017 10:26 IST|Sakshi

సాక్షి, వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్‌ జష్టర్‌‌(62)ను నియమించినట్లు అమెరికా ప్రకటించింది. ఈసందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌ హౌస్‌లో మాట్లాడుతూ భారత్‌లో అమెరికా రాయబారిగా  ఆర్థికవేత్త, నిపుణుడైన కెన్నెత్‌ జష్టర్‌ను నియమించినట్లు ఆయన ప్రకటించారు. గత జూన్‌లోనే భారత్‌కు నూతన రాయబారిని నియమించే అవకాశం ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

కెన్నెత్‌ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారల్లో అమెరికా తరపున అధ్యక్షుడిగా, జాతీయ ఆర్థిక మండలికి డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సెనేట్‌ అమోదం పొందిన వెంటనే జష్టర్‌ గతంలో భారత్‌లో అమెరికా రాయబారిగా కొనసాగిన రిచర్డ్‌ వర్మ ఆయన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారత్‌లో అమెరికా రాయబారి స్థానం ఖాళీగా ఉంది.

మరిన్ని వార్తలు