దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్‌

5 Nov, 2018 05:16 IST|Sakshi

దుబాయ్‌: కేరళకు చెందిన ఓ వ్యక్తికి దుబాయ్‌లో జాక్‌పాట్‌ తగిలింది. యూఏఈలో నిర్వహించిన బిగ్‌ టికెట్‌ లాటరీలో బ్రిట్టీ మార్కోస్‌ అనే వ్యక్తి రూ. 19.85 కోట్లు గెలుపొందాడని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. 2004 నుంచి దుబాయ్‌లో నివసిస్తున్న బ్రిట్టీ అబుదాబీలో డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేస్తున్నాడని తెలిపింది. లాటరీ గెలవడం పట్ల బ్రిట్టీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను కొన్నేళ్లుగా బిగ్‌ టికెట్‌ను కొనుగోలు చేస్తున్నానని, ఇది ఐదోసారని తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చుకునేందుకు, మిగతా దానిని సొంత ఇంటి నిర్మాణానికి వినియోగిస్తానని చెప్పాడు. ఏటా ఎంతో మంది కేరళవాసులకు లాటరీ తగులుతుందని, ఈసారి తాను కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నానని అదే నిజమైందని ఆనందం వ్యక్తంచేశాడు. కాగా, ఈ లాటరీలో మొత్తం పది మంది గెలుపొందగా, వారిలో తొమ్మిది మంది భారతీయులు సహా ఓ పాకిస్తానీ ఉన్నాడు.  

మరిన్ని వార్తలు