‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

15 Jun, 2019 20:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ​కిర్జిస్తాన్‌ బిష్కెక్‌లో జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా దౌత్యపరమైన మర్యాదలు పాటించకుండా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌ ప్రభుత్వం అంతకుమించి కితకితలను నెటిజన్లకు పంచింది. ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌ కేబినెట్‌ సమావేశం శనివారం జరిగింది. కేబినెట్‌ సమావేశం అనంతరం ఆ ప్రావిన్స్‌ సమాచార మంత్రి షౌకత్‌ అలీ యూసఫ్‌జాయి విలేకరులతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చేటప్పుడు క్యాట్‌ ఫిల్టర్స్‌ను ఆన్‌ చేశారు.

అంతే, మంత్రి, ఇతర అధికారులు మాట్లాడుతుండగా.. వాళ్ల ముఖాల మీద ‘డిజిటల్‌ పిల్లి స్టిక్కర్లు’ దర్శనమిచ్చాయి. లైవ్‌ ప్రసారాన్ని వీక్షించిన నెటిజన్లు వెంటనే దీనిని గుర్తించి.. కామెంట్లు కూడా చేశారు. కొంతసేపటివరకు ఇది సాగింది. ఏకంగా మంత్రి లైవ్‌లో డిజిటల్‌ స్టిక్కర్‌లతో పిల్లిలాగా కనిపించడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు వేశారు. ఈ కామెడీ చూడలేక నవ్వి నవ్వి చచ్చిపోయామంటూ కామెంట్‌ చేశారు. ఫిల్టర్‌ తీసేయండి.. మంత్రిగా పిల్లిగా మారిపోయాడని ఒకరు కామెంట్‌ చేస్తే.. పిల్లి డిజిటల్‌ మాస్క్‌ల్లో వాళ్లు భలే క్యూట్‌గా ఉన్నారని, కామెడీలో దీనిని బీట్‌ చేసే వారే లేరని, కేబినెట్‌లో పిల్లి కూడా ఉందని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు