కిమ్‌ చైనా టూర్‌ ఉద్దేశం ఇదే..

19 Jun, 2018 09:34 IST|Sakshi

బీజింగ్‌ : ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెండు రోజుల చైనా పర్యటన నిమిత్తం ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నారు. చైనా అగ్ర నేతలతో కిమ్‌ మంగళవారం, బుధవారం రెండు రోజులు కీలక సంప్రదింపులు జరపనున్నట్టు సమాచారం. ఈనెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సింగపూర్‌లో అమెరికా-కొరియా సమ్మిట్‌లో భాగంగా కిమ్‌ సమావేశమైన నేపథ్యంలో కొరియా నేత చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉత్తర కొరియా నేత కిమ్‌ జూన్‌ 19, 20 తేదీల్లో చైనాలో పర్యటిస్తారని చైనా అధికార వార్తాసంస్థ వెల్లడించింది. చైనాలో కిమ్‌ పర్యటించడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి. గతంలో మార్చిలో బీజింగ్‌ సందర్శించిన కిమ్‌ మేలో ఈశాన్య నగరం దలియాన్‌లో పర్యటించారు. నిరాయుధీకరణకు కొరియా కట్టుబడి ఉంటుందని ప్రకటించిన క్రమంలో ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరేందుకే కిమ్‌ చైనా పర్యటనకు వచ్చారని భావిస్తున్నారు.

కొరియా ద్వీపకల్పంలో నిరాయుధీకరణకు ఉత్తరకొరియా కట్టుబడి ఉందని ట్రంప్‌తో భేటీ సందర్భంగా కిమ్‌ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు