పుతిన్‌కు కిమ్‌ జోంగ్‌ ఉన్ లేఖ‌

9 May, 2020 10:33 IST|Sakshi

సియోల్‌ : ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్‌కు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల విజయం 75 వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ లేఖ రాశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై ర‌ష్యా విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. కరోనాపై విజ‌యం సాధించి శ‌క్తివంత‌మైన ర‌ష్యాను నిర్మించ‌డానికి అక్క‌డి ప్ర‌జ‌లు చేస్తున్న పోరాటంలో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యాలో కరోనా కోరలు చాస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రతీరోజు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో కరోనా కేసులు లక్షా 87వేలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1723కు చేరుకుంది. (దాయాది దేశంపై మండిపడ్డ ఉత్తర కొరియా)

అంతకుముందు కిమ్‌ చైనా కరోనాపై పోరాటం చేసి సాధించిన విజ‌యాల‌ను ప్ర‌శంసిస్తూ ఆ దేశ అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు వ్యక్తిగత సందేశాన్ని పంపిన‌ట్లు అధికారిక కొరియా సెంట్ర‌ల్ న్యూస్ ఏజెన్సీ శనివారం తెలిపింది. వైర‌స్ బారిన ప‌డ‌కుండా నెల‌ల త‌ర‌బ‌డి దేశ స‌రిహ‌ద్దును మూసివేసిన త‌రువాత చైనా, ఉత్త‌ర కొరియా దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఆర్థికంగా లాభం చేకూరుతాయ‌ని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40 లక్షలు దాటగా, ఇప్పటివరకు  కరోనాతో 2.75 లక్షల మంది మృతి చెందారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 13.77 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
(జిన్‌పింగ్‌పై కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రశంసలు!)
(మొన్న కనబడింది నకిలీ కిమ్‌, మరో కొత్త వాదన!)

మరిన్ని వార్తలు