మొన్న కనబడింది నకిలీ కిమ్‌, మరో కొత్త వాదన!

6 May, 2020 18:34 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఆరోగ్యానికి సంబంధించి ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు నడిచాయి. కిమ్‌ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన గుండెనొప్పితో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్స జరిగిందని,  చివరి క్షణాల్లో ఉన్నారని, మరోసారి ఏకంగా ఆయన మరణించాడని ఇలా అనేక వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వదంతులన్నింటికి చెక్‌ పెడుతూ మే 2 వ తేదీన ఒక ఫెర్టిలైజర్‌ కంపెనీ ఓపెనింగ్‌కి వచ్చి కిమ్‌ రిబ్బన్‌ కట్‌ చేశాడు. దీంతో 20 రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్‌ పబ్లిక్‌లో ఒక్కసారిగా కనిపించి అందరి నోటికి తాళాలు వేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం కూడా దుమారంగా మారింది. (మావో సూట్, మారిన హెయిర్స్టైల్)

మే 2న కనిపించింది కిమ్‌ కాదని, నకిలి కిమ్‌ అని కొంతమంది సోషల్‌ మీడియా యూజర్లు ఆయన పాత ఫోటోలని కొత్త ఫోటోలతో పోలుస్తూ నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతక ముందు ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు  హిట్లర్‌, సద్దామ్‌ హుస్సేన్‌ లాంటి వాళ్లు కూడా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు తమ బదులు నకిలిని పంపించేవారు. ఇప్పుడు కిమ్‌ కూడా తన ఆరోగ్యం బాగుపడే వరకు ఇదే చెయ్యాలనుకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. (కిమ్ చేతిపై ఏమిటా గుర్తు?)

మాజీ బ్రిటీష్‌ సభ్యురాలు లూయిస్‌ మెన్ఛ్‌ అది వరకు తీసుకున్న ఫోటోలతో పోలీస్తే కిమ్‌ పళ్ల వరుస తేడాగా ఉందని తన ట్వీటర్‌లో  రెండు ఫోటోలు జోడించి ట్వీట్‌ చేశారు. ఇప్పుడు చాలా మంది ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. కిమ్‌ కనబడగానే వదంతులన్ని ముగిసిపోతాయి అనుకుంటే కొత్తగా మరికొన్ని రూమర్స్‌   చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని వార్తలు