మిస్‌ ఇండియా అమెరికా-2019గా కిమ్‌ కుమారి

21 Feb, 2019 08:26 IST|Sakshi

న్యూజెర్సీలోని ఫోర్ట్స్ సిటీలో జరిగిన తుదిపోరులో ‘మిస్‌ ఇండియా అమెరికా-2019’  కిరీటాన్ని అందాల భామ కిమ్‌ కుమారి దక్కించుకుంది. మిస్‌ న్యూజెర్సీ అయిన కుమారి అమెరిలోకి 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75మందితో పోటీపడి చివరికి విజేతగా నిలిచింది. దీంతో కిమ్‌ కుమారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అమృత చెహిల్‌, సౌమ్యా సక్సెనా రన్నరప్స్‌గా నిలిచారు. ఈ కార్యక్రమానికి అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాక్షి శేషాద్రి న్యాయనిర్ణేతగా వ్యవహించారు. 

మరిన్ని వార్తలు