అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

7 Aug, 2019 09:04 IST|Sakshi

సియోల్‌ : అణు నిరోధక చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయినా క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా కొనసాగిస్తూనే ఉంది. అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలకు హెచ్చరికగానే తాజాగా వ్యూహాత్మక​ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం స్పష్టం చేశారు. గత రెండు వారాల్లో నాలువదిగా చెబుతున్న క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియాలతో అణ్వస్త్ర నిరోధక చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో చేపట్టడం గమనార్హం.

ఉత్తర కొరియా పశ్చిమ ప్రాంతం నుంచి ప్రయోగించిన వ్యూహాత్మక క్షిపణులు ఆయుధ సామర్ధ్యం, భద్రత, యుద్ధ సామర్థ్యాలను స్పష్టంగా పరిశీలించాయని ఉత్తర కొరియా అధికార వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు కొరియా క్షిపణి పరీక్షలపై తాము అతిగా స్పందించబోమని అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ పేర్కొన్నారు. కాగా అమెరికాను సవాల్‌ చేసేలా ఖండాంతర శ్రేణి క్షిపణి పరీక్షలను తిరిగి ప్రారంభించబోమని ట్రంప్‌కు కిమ్ జోంగ్ ఉన్ ఇచ్చిన హామీని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు