పదవిని త్యజించిన మలేసియా రాజు

7 Jan, 2019 05:57 IST|Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా రాజు సుల్తాన్‌ ముహమ్మద్‌ 5(49) తన పదవిని త్యజించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా రాచరిక విధులకు దూరంగా ఉంటున్న ఆయన రష్యా మాజీ సుందరిని వివాహమాడినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ముహమ్మద్‌ భవిష్యత్తుపై వినిపిస్తున్న ఊహాగానాలకు రాజభవనం ఎట్టకేలకు తెరదించింది. ఆయన తన పదవికి రాజీనామా చేశారని, అది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా ఆయన నిలిచారు. ఆయన నిష్క్రమణకు కారణమేంటో రాజభవనం చెప్పలేదు. రష్యా మాజీ సుందరిని ఆయన వివాహం చేసుకున్నారన్న వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.  మలేసియా రాజు పదవీకాలం ఐదేళ్లు కాగా, ముహమ్మద్‌ రెండేళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. 9 వంశాల మధ్య ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది.  

మరిన్ని వార్తలు