ఇక పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవచ్చు

12 Dec, 2017 12:32 IST|Sakshi

ఒకరిని విడిచి ఒకరు వెళ్లేటపుడు అందరికి బాధగా ఉంటుంది. ఆ సమయంలో ప్రేమతో అక్కున చేర్చుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ, చుట్టు ఉన్నవారు చూస్తారన్న భయంతో ఇబ్బం‍ది పడుతుంటారు. ఈ భయానికి చెక్‌ పెట్టేందుకు చాలా దేశాలు పబ్లిక్‌గా ముద్దు పెట్లుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. ముద్దులు పెట్టుకునేందుకు కొన్ని దేశాలు ఏకంగా ఎయిర్‌పోర్టులలో ప్రత్యేక కిస్సింగ్ జోన్‌లను ఏర్పాటు చేసి, దానికి కొంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయాన్ని మూడు నిమిషాలకు నిర్ణయించారు. అంతకు మించి కిస్‌ చేసుకోవడానికి అనుమతి లేదు. 

సాధారణం‍గా ఉద్యోగ రిత్యా మనసుకు నచ్చిన వారో, బంధువులో విదేశాలకు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురవుతారు.  దానిని వ్యక్త పరచడానికి ప్రయతిస్తుంటారు.  దీనిని గుర్తించిన కొన్ని ఎయిర్ పోర్టులు కిస్సింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సింగపూర్,  డెన్మార్క్, పారిస్‌, హాంకాంగ్, రోమ్, శాన్‌ఫ్రాన్సిస్కో మొదలైన దేశాల్లోని ఎయిర్ పోర్టులలో కిస్సింగ్ జోన్లు ఉన్నాయి. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం చాలా దేశాల్లో అనుమతి లేదు. 

మరిన్ని వార్తలు