లండన్‌లో కత్తిపోట్లు

30 Nov, 2019 06:32 IST|Sakshi

లండన్‌: లండన్‌ బ్రిడ్జ్‌ వద్ద కత్తితో పలువురిని గాయపరిచిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ముందు జాగ్రత్త కోసం ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే లండన్‌ బ్రిడ్జ్‌ వద్ద ఓ వ్యక్తి కత్తితో పలువురిని గాయపరిచాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని మట్టుబెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్‌ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

మరిన్ని వార్తలు