ఉన్మాదిని కాల్చి చంపిన పోలీసులు.. ఎందుకు?

19 Aug, 2017 16:23 IST|Sakshi

సాక్షి, మాస్కో: రష్యాలో సుర్గుత నగరంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. రోడ్డుపై నడిచివెళ్తున్నవారిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా ఎనిమిది మందిని పౌరులను గాయ పరిచాడు. అడ్డుకోపోయిన పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి అదుపు తప్పతోందని భావించిన పోలీసులు నిందితుడిని కాల్చిచంపారు. ఈ సంఘటన రాజధాని మాస్కోకు సుమారు 2100 కిలోమీటర్ల దూరం ఉన్న చైన్‌మన్సీ ప్రాంతంలో జరిగింది.

పోలీసులు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11.20  గంటల సమయంలో నగరం రద్దీగా ఉన్నవేళ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రయాణికులపై దాడులకు పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఎదరుదాడికి దిగాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు ఇన్వెస్టిగేషన్‌ కమిటీ ఉన్నాధికారులు తెలిపారు.

నిందితుడు దాడి చేసిన వారిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది. మరో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలిని పిలుపునిచ్చింది, సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ దేశ పౌరులు, మీడియా సహకరించాలని కోరింది.