ఐదు భాగాల‌పై క‌న్నేసిన చైనా

19 Jun, 2020 10:22 IST|Sakshi

లాసా: ల‌డ‌ఖ్ గాల్వ‌న్ లోయ‌లో చైనా దొంగ‌దెబ్బ తీయ‌డంపై టిబెట్ నేత ల‌బ్సాంగ్ సంగాయ్‌ భార‌త్‌ను జాగ్రత్తగా ఉండాలని హెచ్చ‌రించారు. స‌రిహ‌ద్దులో దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డ చైనా తీరు చూస్తుంటే అది "ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్ స్ట్రాట‌జీ" అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోందని తెలిపారు. "ఈ సిద్ధాంతం ప్ర‌కారం అర‌చేతిగా భావించే టిబెట్‌ను మావో జిడాంగ్ స‌హా ఇత‌ర చైనా నేత‌లు ఇప్ప‌టికే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మిగ‌తా ఐదు వేళ్లను ఆక్ర‌మించుకునే దిశ‌గా కుయుక్తులు ప‌న్నుతున్నారు. (చైనా దగ్గర తుపాకులున్నాయి. కానీ.. : దలైలామా)

ఇందులో ఇప్ప‌టికే మొద‌టి వేలు ల‌డ‌ఖ్‌పై డ్రాగ‌న్ దేశం దృష్టి సారించ‌గా మిగ‌తా వేళ్లు నేపాల్‌, భూటాన్‌, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు రానున్న కాలంలో ముప్పు త‌ప్ప‌దు"  అని తెలిపారు. దీనిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని గ‌త 60 సంవ‌త్స‌రాలుగా టిబెట్ నేత‌లు భార‌త్‌ను హెచ్చ‌రిస్తూనే ఉన్నారని ఆయ‌న పేర్కొన్నారు. కాగా భార‌త్‌-చైనా మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకోగా 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులైన విష‌యం తెలిసిందే. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!)

మరిన్ని వార్తలు