లేడీస్‌ టాయిలెట్‌ ఉపయోగించిందని..

20 May, 2018 18:24 IST|Sakshi
జజ్మినా సావేండ్ర

లాస్‌ ఏంజెలెస్‌: ట్రాన్స్‌జెండర్‌ లేడీస్‌ టాయిలెట్‌ ఉపయోగించిందని ఆమెపై విరుచుకుపడిందో రాజకీయనాయకురాలు. ఆ దృశ్యాలను స్వయంగా వీడియో తీసిన ఆమె సోషల్‌ మీడియాలో ఉంచింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రిపబ్లికన్‌ కాంగ్రేషనల్‌ పార్టీకి చెందిన జజ్మినా సావేండ్ర అనే రాజకీయనాయకురాలు లాస్‌ ఏంజెలెస్‌ డెన్నీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ ట్రాన్స్‌జెండర్‌ లేడీస్‌ టాయిలెట్‌ను ఉపయోగించటం ఆమె గమనించారు.

దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జజ్మినా ట్రాన్స్‌జెండర్‌పై విరుచుకుపడంది. ట్రాన్స్‌జెండర్‌ను అవమానిస్తూ తీవ్ర దుర్భాషలాడింది. ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో తీసిన జజ్మినా దాన్ని సోషల్‌ మీడియాలో ఉంచారు. ఇలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను తిట్టడంపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కు తగ్గిన జజ్మినా తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఎదురు దాడి మరింత పెరిగింది. 

మరిన్ని వార్తలు