అగ్రరాజ్యంలో విలయతాండవం చేస్తున్న కరోనా

13 Jul, 2020 08:43 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసీ: అగ్రరాజ్యంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా కేసులలో  ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో గత ఐదు రోజులుగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అమెరికాలో 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో రికార్డుస్థాయిలో ఒక్కరోజులో 15,299 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎక్కువ టెస్ట్‌లు చేస్తున్న కారణంగా ఇన్ని కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ప్రజలెవరు కరోనా మార్గదర్శకాలు పాటించకుండా రోడ్లపై స్వేచ్చగా తిరుగుతుండటం కూడా ఫ్లోరిడాలో ఈ సంఖ్యలో కేసులు పెరగడానికి ఒక కారణంలాగా చెబుతున్నారు. ఇక అమెరికా మొత్తం మీద గడిచిన 24 గంటల్లో  442 మంది మరణించారు. ఇప్పటి వరకు  అగ్రరాజ్యంలో 3,413,995 మంది పడగా, 1,37,782 మంది మరణించారు. 1,517,084 కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ఇప్పటి వరకు నమోదయైన కరోనా కేసుల సంఖ్య 879,466 ఉండగా, 23,187 మంది మరణించారు.554,429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

చదవండి: మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్‌

మరిన్ని వార్తలు