ఈ ఏడాదిలో ఒక సెకను అదనం!

30 Dec, 2016 08:36 IST|Sakshi
ఈ ఏడాదిలో ఒక సెకను అదనం!

వాషింగ్టన్: 2016 సంవత్సరం ఒక సెకను కాలంపాటు ఎక్కువగా ఉండబోతోంది. కొత్త ఏడాదికి ముందు ఒక లీపు సెకనును ఈ సంవత్సరానికి కలపనుండటమే ఇందు కు కారణం.

వాషింగ్టన్ డీసీలోని ‘యూఎస్‌ నావల్‌ అబ్జర్వేటరీస్‌ మాస్టర్‌ క్లాక్‌ ఫెసిలిటీ’వద్ద డిసెంబరు 31న యూటీసీ (కో–ఆర్డినేటెడ్‌ యూనివర్సల్‌ టైమ్‌) కాలమానం ప్రకారం సమయం 23:59:59 సెకన్లు ఉన్నప్పుడు లీపు సెకనును కలుపుతారు. అంటే భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల 59 సెకన్లు ఉన్నప్పుడు ఆ ఒక్క సెకను అదనంగా కలుస్తుంది.

మరిన్ని వార్తలు