మూత్రాశ‌యంలో జ‌ల‌గ‌: 500 మి.లీ. ర‌క్తం తాగి

26 Jun, 2020 19:41 IST|Sakshi

ఫెనోమ్ పెన్: జ‌ల‌గ.. దీని పేరు త‌లుచుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. ఒక్క‌సారి అది శ‌రీరాన్ని ప‌ట్టుకుందంటే రక్తం తాగుతూనే ఉంటుంది. ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాణిగా అనిపించే ఈ జ‌లగ ఓ యువ‌కుడి పురుషాంగం ద్వారా అత‌ని శ‌రీరంలోకి ప్ర‌వేశించింది. ఈ ఘ‌ట‌న కాంబోడియాలో చోటు చేసుకుంది. ఫోమ్ పెన్‌కు చెందిన‌ ఓ యువ‌కుడు స‌ర‌దాగా చెరువులో ఈత‌కెళ్లాడు. ఈ క్ర‌మంలో ఓ జ‌ల‌గ అత‌ని పురుషాంగం ద్వారా శ‌రీరం లోప‌లికి ప్ర‌వేశించింది. ఇదేమీ గ‌మ‌నించ‌ని అత‌డు ఈత కొట్ట‌డం ముగియ‌గానే ఇంటికెళ్లిపోయాడు. త‌ర్వాతి రోజు అత‌ను టాయిలెట్‌కు వెళ్ల‌గా నొప్పి మొద‌లైంది. త‌ర్వాత ఆ నొప్పి మ‌రింత తీవ్రం కావ‌డంతో విల‌విల్లాడిపోయాడు. వెంట‌నే ఆసుప‌త్రికి ప‌రుగెత్తాడు. (జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!)

అత‌డి స‌మ‌స్య ఏంటో తెలుసుకునేందుకు వైద్యులు అత‌డి మూత్రాశ‌యంలోకి సూక్ష్మ‌మైన కెమెరా పంప‌గా జ‌ల‌గ ఉన్న‌ట్లు తెలిసింది. పురుషాంగం ద్వారా అది మూత్రాశ‌యానికి చేరుకుని స్థిర‌ప‌డిపోయిన‌ట్లు గుర్తించారు. ర‌క్తం తాగుతున్న కొద్దీ దాని ప‌రిమాణం పెర‌గ‌డంతో యువ‌కుడి అంత‌ర్గ‌త అవ‌య‌వాలు సైతం దెబ్బ తిన్నాయి. అవ‌యవాన్ని అంటిపెట్టుకుని ఉన్న‌ప్పుడు బ‌య‌ట‌కు తీయ‌డం ప్ర‌మాద‌క‌రం కాబ‌ట్టి వైద్యులు బైపోలార్ రెసెక్టోస్కోప్ సాయంతో జ‌ల‌గ‌ను శ‌రీరంలోనే చంపేసి, అనంత‌రం దాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఇక ఆ జ‌ల‌గ 500 మిల్లీలీట‌ర్ల ర‌క్తం తాగిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. (గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..)

మరిన్ని వార్తలు