320 కోట్ల ఏళ్ల కిందటే జీవి పుట్టుక

17 Feb, 2015 16:25 IST|Sakshi

మొదటి జీవి ఎప్పుడు పుట్టిందన్న విషయమై ప్రతిసారీ కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. భూమ్మీద 320 కోట్ల ఏళ్ల క్రితమే జీవి పుట్టిందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నుంచి నత్రజనిని తీసుకుని, దాన్ని జీవజాలానికి పనికొచ్చేలా చేసే ప్రక్రియ 320 కోట్ల ఏళ్ల క్రితమే జరిగిందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంతకుముందు వరకు అయితే.. 200 కోట్ల ఏళ్ల క్రితమే వాతావరణంలోని నత్రజనిని ఉపయోగించుకున్నారని భావిస్తూ వచ్చారు. తాజా సిద్ధాంతంతో జీవి మనుగడ మరో వంద కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లయింది.

వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్ర్రవేత్తలు. దక్షిణ ఆఫ్రికా, ఆగ్నేయ ఆస్ట్రేలియా ప్రాంతాల్లోని శిలాజాలపై జరిపిన పరిశోధనల్లో ఈ సంగతి రుజువైంది. జీవి పుట్టుకకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తెల్సుకోవడంద్వారా మానవ పరిణామక్రమాన్ని మరింత సులువుగా అధ్యయం చేసే వీలుంటందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు