తక్కువ నిద్రకు కారణమదే!

22 Jun, 2015 09:11 IST|Sakshi
తక్కువ నిద్రకు కారణమదే!

వాషింగ్టన్: పూర్వీకులతో పోలిస్తే మనం నిద్రపోయే సమయం క్రమంగా తగ్గిపోతోంది. ఇలా మనం తక్కువ సమయం నిద్ర పోవడానికి గల కారణాల్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కృత్రిమంగా సృష్టించిన కాంతి, విద్యుత్ వల్లే మానవులు నిద్రపోయే సమయం తగ్గుతోందని వారు అంటున్నారు. ఎందుకు నేటి తరం తక్కువ సమయం నిద్రపోతోందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా విద్యుత్ సౌకర్యం లేని రెండు గిరిజన జాతి తెగలను వారు పరిశీలించారు.

ఇందులో ఒక తెగ వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా, మరో తెగవారి ప్రాంతంలో మాత్రం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు. అనంతరం రెండు తెగల వారిని పరిశీలించగా, విద్యుత్ కాంతి ప్రభావానికి గురైన వారు క్రమంగా గంటపాటు తక్కువ నిద్రపోయే స్థితికి చేరుకున్నారు. మిగతా ప్రాంతం వారు మాత్రం ఎప్పటిలాగానే కావాల్సినంత సమయం నిద్ర పోయారు. దీని వల్ల తక్కువ నిద్ర పోయేందుకు విద్యుత్, కృత్రిమ కాంతి కారణాలని రుజువైంది.

మరిన్ని వార్తలు