పిచ్చెక్కించిన పులిబొమ్మ

19 Jun, 2015 12:42 IST|Sakshi
పిచ్చెక్కించిన పులిబొమ్మ

తంపా: ఒక బాలుడు తెచ్చుకున్న పులిబొమ్మ.. తంపా విమానాశ్రయ అధికారులకు తలపోటు తీసుకొచ్చింది. ఆ వెంటనే రిలీఫ్ ఇచ్చి సరికొత్త ఆలోచనకు ప్రాణంపోసి వారిలో నవ్వులు పూయించింది. ఓవెన్ అనే ఆరేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి హ్యూస్టన్ వెళ్లేందుకు తంపా విమానాశ్రయానికి వచ్చాడు. అయితే, తన వెంట తెచ్చుకున్న హాబ్స్ అనే పులిబొమ్మ పోగొట్టుకున్నాడు. దీంతో అతడు బిక్కమొఖం పెట్టుకొని ఏడుపు మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోక తల్లి దండ్రులు విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో వారంతా కలిసి ఎయిర్ పోర్ట్ మొత్తం జల్లెడ పెట్టారు. ఒక సాహసయాత్ర మాదిరిగా చేసి చివరికి చిన్న పిల్లలు ఆడుకునే ప్రాంతంలో దానిని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సాహసయాత్రగా చేసిన ఈ కార్యక్రమాన్ని 'ఎడ్వంచర్' అనే పేరుతో అప్పటికప్పుడు డాక్యుమెంటరీ రూపొందించారు. పులిబొమ్మ హాబ్స్తో ఫొటోలు దిగారు. ఆ పిల్లాడికి చూపించి సంతోష పెట్టారు. ఎట్టకేలకు ఓవెన్ తిరిగి తనకిష్టమైన హాబ్స్తో హ్యూస్టన్ వెళ్లాడు.

>
మరిన్ని వార్తలు