నగ్నంగా తినేందుకు 40 వేలమంది రెడీ!

5 May, 2016 09:40 IST|Sakshi
నగ్నంగా తినేందుకు 40 వేలమంది రెడీ!

లండన్: బ్రిటన్లోని లండన్లో గల బున్యాడి రెస్టారెంటు తెగ ఊరిస్తోంది. అందులోకి ఎప్పుడు బట్టలు విప్పుకొని వెళ్లి లంచ్ లాగించేద్దామా అని వేలమంది క్యూకట్టి ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్న ఈ రెస్టారెంటు మాత్రం ఇంకో నెలరోజులకుగాను ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. బహుషా ఆ రోజు నాటికి ఇలా వెయిట్ చేసే వారి సంఖ్య లక్షలకు చేరిన ఆశ్చరపోక తప్పదేమో..

లండన్లో బున్యాదిలో ఓ రెస్టారెంటు నిర్మిస్తున్నారు. ఇందులోకి వచ్చేవారు దుస్తులన్నింటిని విప్పేసుకొని భోంచేసే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. ఇది జూన్ నెలలో ప్రారంభం కానుంది. అయితే, ఇందులో తీవ్ర నిరుత్సాహ పరిచే విషయం ఏమిటంటే.. ఈ రెస్టారెంటులో ఒకసారి 42 మాత్రమే కూర్చుని భోంచేసే అవకాశం ఉంది. దీంతో మొదటి 42మంది తప్ప మిగితా వారంతా క్యూ కట్టి ఎదురుచూడాల్సిందే. పోని ఇంకోసారి వద్దాంలే అనుకుని వెళ్లారో.. తిరిగొచ్చేవరకు మరో భారీ క్యూ వెనకాలే నిల్చోవడం కాయం. ఈ నేపథ్యంలో తమ వంతుకోసం ఎన్నిరోజులైనా పర్వాలేదనుకొని వేలమంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

ఇలా 42మంది మాత్రమే బట్టలు విప్పేసుకొని భోంచేసే సామర్ధ్యం ఉన్న ఈ రెస్టారెంట్ కోసం ఇప్పటికే 42 వేలమందికి పైగా సైనప్ అయ్యారు. ఈ రెస్టారెంటును లాలిపాప్ అనే కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ఈ రెస్టారెంటుకు వస్తున్న స్పందనను చూసి ఆ కంపెనీ యజమాని సెబ్ లియాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారుజ. 'బీచ్ ల్లాంటి ప్రదేశాల్లో.. స్నానం చేసే వేళల్లో ప్రజలు కాస్త సిగ్గుపడుతూనైనా నగ్నంగా మారిపోవాలని అనుకుంటారు.

అలాంటిది స్వేచ్ఛగా నగ్నంగా మారేందుకు వీలు కల్పిస్తే సాధారణంగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు' అని ఆయన చెప్పారు. అయితే, నగ్నంగా ఈ రెస్టారెంటుకు వచ్చిన వారికి వడ్డించే వారు మాత్రం అర్ధనగ్నంగా ఉంటారు. ఇందులో ఒకసారి భోంచేయాలంటే.. కనీసం ఏడువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇందులో సెల్ఫీలవంటి వాటికి అనుమతించరు. ఇందులోకి ప్రవేశించే ముందే వారి ఎలక్ట్రానిక్ డివైస్లు అన్నీ కూడా రిసెప్షన్లో పెట్టి వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు