ఆకాశంలో స్విమ్మింగ్ పూల్

21 Aug, 2015 19:50 IST|Sakshi
ఆకాశంలో స్విమ్మింగ్ పూల్

ఆకాశంలో స్విమ్మింగ్ పూల్ ఏంటని ఆశ్చర్యంగా ఉందా? నిజంగా నిజమేనండోయ్..! ప్రపంచంలో తొలి 'స్కై పూల్'ను లండన్లో నిర్మిస్తున్నారు. రెండు విలాసవంతమైన పెద్ద భవంతుల మధ్య.. భారీ ఖర్చుతో అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 10 అంతస్తులున్న రెండు టవర్ల మధ్య 90 అడుగుల పొడవు, 4 మీటర్ల లోతు ఉండేలా ఈ స్విమ్మింగ్ పూల్ ను నిర్మిస్తున్నారు. ఇది థేమ్స్ నదికి సమీపంలో ఉంది.  ఈ స్విమ్మింగ్ పూల్లో నుంచి లండన్ నగరాన్ని వీక్షించవచ్చు.

స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి పూర్తిగా ట్రాన్సపరెంట్ గ్లాస్ వాడారు. నీళ్లు, మనుషుల బరువును ఈ స్విమ్మింగ్ పూల్ తట్టుకుంటుందా? ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే ఈ స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొట్టడానికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని నిర్మాణ సంస్థ బాలీమోర్ గ్రూపు తెలిపింది. ఈ గ్లాస్ బాడీ 8 అంగుళాల మందంతో పటిష్టంగా ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల కంటే ఏడు రెట్లు మందంగా ఉంటుంది. కాగా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం 2018 నాటికి పూర్తికానుంది. ఈ టవర్స్లోని అపార్ట్మెంట్లను మాత్రం వచ్చే సెప్టెంబర్ నుంచి అమ్మకానికి పెడుతున్నారు. ఒక్కో ప్లాట్ ప్రారంభ ధర ఎంతంటే అక్షరాల 6.20 కోట్ల రూపాయలు.

మరిన్ని వార్తలు