టుస్సాడ్‌ మ్యూజియంలో బీబర్‌ విగ్రహం

12 Oct, 2016 19:32 IST|Sakshi

లండన్:  లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రముఖ పాప్‌ సింగర్‌ జస్టిన్ బీబర్‌ కొత్త మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వారంలో లండన్ లోని ఓ2 అరేనా స్టేడియంలో అంతర్జాతీయ ప్రదర్శన ఇవ్వబోతున్న సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. బీబర్‌ చొక్కాలేకుండా ఉండే మైనపు ప్రతిమను ఆవిష్కంచారు.

‘రెయిన్ షవర్‌ ఫినాలే’ ప్రదర్శనలోని బీబర్‌ గెటప్‌ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. బీబర్‌ 22వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ మ్యూజియం తొలిసారిగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం కొత్తగా ఆవిష్కరించిన మైనపు ప్రతిమ రెండోది. 2017 జనవరి మూడో తేదీవరకు మాత్రమే ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచుతామని టుస్సాడ్‌ మ్యూజియం నిర్వాకులు తెలిపారు.

మరిన్ని వార్తలు