ఆటోఫేగీని నియంత్రిస్తే దీర్ఘాయుష్షు

17 Sep, 2017 04:15 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: వయసు పెరిగే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టి చివరకు మరణించడం చాలా సహజం. అయితే ఎందుకిలా జరుగుతుం దన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇప్పటివరకు లేదు. జర్మనీలోని ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మాలిక్యులార్‌ బయాలజీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వార్ధక్యం ఎందుకు వస్తుందన్న కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కున్నామని అంటున్నారు. శరీర కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ, వీటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తుంటాయి కదా.

ఒకసారి పనిచేయడం ఆగిపోయాక.. కణాల్లోని భాగాలను నాశనం చేసేందుకు ఆటోఫేగీ అనే ఓ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ చిన్నతనంలో ఆరోగ్యం, శరీరధారుడ్యానికి తోడ్పడితే.. వయసు పెరిగే కొద్దీ వార్ధక్య లక్షణాలను ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆటోఫేగీని నిలిపేయడం ద్వారా వయసు మీరిన కీటకాల్లో వార్ధక్య లక్షణాలతోపాటు నాడీ సంబంధిత సమస్యలు కూడా తగ్గినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాలుపం చుకున్న శాస్త్రవేత్త జోనాథన్‌ బైర్న్‌ చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు