అదృష్ట దైవం ఆంజనేయుడు

17 Jan, 2016 04:08 IST|Sakshi
అదృష్ట దైవం ఆంజనేయుడు

వాషింగ్టన్: అమెరికా అద్యక్షుడు  ఒబామా నిరుత్సాహంతో కుంగిపోయినపుడు ఆరాధించే దైవం ఆంజనేయుడు. త్రిశూలం, చక్రధారి అయిన హనుమంతుని చిన్న ప్రతిమను ఎల్లవేళలా తన జేబులో ఉంచుకుంటానని యూట్యూబ్ కార్యక్రమ నిర్వాహకురాలు ఇన్‌గ్రిడ్ నీల్సన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఒబామా వెల్లడించారు. కాంగ్రెస్ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యంలో శుక్రవారం ఈ ఇంటర్వ్యూ జరిగింది. పాకెట్‌లో ఉన్నవేంటని ఆమె ప్రశ్నించడంతో జేబులోనివన్నీ ఒబామా బయటకు తీశారు.

వాటిల్లో ఆంజనేయుడి ప్రతిమ, పోప్ బహూకరించిన శిలువమాల, బౌద్ధసన్యాసి ఇచ్చిన బుద్ధుని విగ్రహం, వెండి పోకర్ ఆట చిప్, ఇథియోపియా కోప్టిక్ క్రాస్ ఉన్నాయి. వీటన్నింటినీ తప్పకుండా వెంట తీసుకెళ్తానని  ఒబామా అన్నారు.

మరిన్ని వార్తలు