ఒక్క లాటరీ.. 1,100 కోట్లు..

16 Mar, 2014 03:08 IST|Sakshi
ఒక్క లాటరీ.. 1,100 కోట్లు..


 వాషింగ్టన్: ఓ కారు.. పెద్ద బంగళా.. ఒంటి నిండా బంగారం.. పేద్ద టీవీ, ఫ్రిడ్జ్ వంటి సామగ్రి.. ఇంకా...!? ఇవన్నీ కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహించాల్సిందే.. అదే మరి ఒక్కసారిగా కొన్ని వందల కోట్లు వచ్చేస్తే ఎలా ఉంటుంది? అమ్మో వందల కోట్లే..!! అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. బ్రిటన్‌లోని ఒకాయన లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కాదు కాదు.. వందల కోట్లీశ్వరుడు అయిపోయాడు. ఆ లాటరీలో వచ్చిన మొత్తం ఎంతో తెలుసా.. సుమారు 1,100 కోట్ల రూపాయలు (108 మిలియన్ల పౌండ్‌లు). దీంతో మనోడి జీవితమే మారిపోయింది. ఈ దెబ్బతో ఆయన బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలోకి కూడా ఎక్కేశాడు.
 
  బ్రిటన్‌లో లాటరీల్లో అత్యధిక మొత్తం పొందిన వారిలో ఈయన నాలుగో వ్యక్తి. అయితే, ఇంకా ఈ లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఎవరో వెల్లడించలేదు. ఇంతకు ముందు  2011లో కోలిన్ అండ్ క్రిస్‌వెయిర్‌కు ఏకంగా రూ. 1,650 కోట్లు లాటరీ తగిలింది.

మరిన్ని వార్తలు