ఒక్కసారి ఐదు సింహాలు మీద పడినా..

26 May, 2016 14:10 IST|Sakshi
ఒక్కసారి ఐదు సింహాలు మీద పడినా..

ఒక్క సింహం ఎదురుగా వస్తేనే.. పై ప్రాణాలు పైకి పోతాయి. అలాంటిది ఐదు సింహాలు ఒక్కసారి విరుచుకుపడి.. మీద పడితే తప్పించుకునే అవకాశముంటుందా? ఏ జీవి అయినా ప్రాణాల మీద ఆశ పెట్టుకుంటుందా? కానీ ఓ దున్నపోతు మాత్రం అనూహ్యమైన రీతిలో అద్భుతంగా తప్పించుకుంది.

ఐదు సింహాలు ఒక్కదానితో ఒకటి పోట్లాడుకోవడంలో మునిగితేలడంతో 'బతుకు జీవుడా' అనుకుంటూ.. ఆ దున్నపోతు అక్కడి నుంచి పలాయనం చేసి ప్రాణాలు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాలోని మాలామాలా ప్రైవేటు గేమ్ రిజర్వాయర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో బాగా షికారు చేస్తోంది. అన్నట్టు ఇటీవల హైదరాబాద్‌ జూలోని సింహాల బోనులోకి వెళ్లినా ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డ సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు