గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!

25 Apr, 2016 21:55 IST|Sakshi
గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!

మన ఫోన్లోని ఫీచర్స్ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా? అంటే అవుననే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వర్చువల్ స్ర్కీన్ పేరు విన్నారా? అదేనండీ ఎదురుగా కంటికి కనిపించకపోయినా సాఫ్ట్వేర్ సాయంతో చూపడం.

ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించే మేజిక్ లీప్ అనే అమెరికన్ స్టార్టప్ మనకు కావలసినప్పుడు అవసరమైన చోట దీన్ని ఉపయోగించుకునేలా తయారుచేయడానికి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో గాలిలోనే యాప్స్ సాయంతో వర్క్, ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ తదితరాలను చేసుకోవడం ఉంది.

ఈ వీడియో అంతా ఒక గదిలోనే చిత్రించడం వల్ల పగటిపూట ఎలా పనిచేస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించకపోయినా కళ్లజోడు లేక కాంటక్ట్ లెన్స్లను ఉపయోగించడం వల్ల పగటిపూట కూడా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇది

మైక్రోసాఫ్ట్ 2015లో విడుదల చేసిన హాలోగ్రామ్(కాంతితో ఏ ఆకారన్నయినా తయారుచేసుకోవడం)ను పోలినట్లుగా ఉంది. ఇప్పటికే గూగుల్ ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తూ 3డి కళ్లజోడు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2015లోనే విడుదల కావాల్సిన గూగుల్ కళ్లజోడుకు మరికొన్ని ఫీచర్స్ను జతచేసేందుకు ఆ పనిని విరమించుకుంది.

ప్రస్తుతం గూగుల్తో పాటు ఆలీబాబా, క్వాల్కామ్లు ఈ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి.