డల్లాస్లో మొక్కలు నాటిన ఎన్నారైలు

20 Nov, 2015 14:21 IST|Sakshi
డల్లాస్లో మొక్కలు నాటిన ఎన్నారైలు

డల్లాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో టెక్సాస్ ట్రీ ఫౌండేషన్, ఇర్వింగ్ సిటీ, డీఎఫ్డబ్ల్యూ కమ్యూనిటీ వారు సంయుక్తంగా మొక్కలు నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ రక్షణకు గాంధీ ఎప్పుడు మద్ధతు తెలిపేవారని, 'గాలి, నీరు, భూమి, నేల కేవలం మనవి మాత్రమే కాదు.. మన తర్వాతి తరాలకు మనం వారసత్వంగా వాటిని అందించాలన్న' మహాత్ముని మాటలను మహాత్మాగాంధీ మెమోరియల్ సెక్రటరీ, కన్స్ట్రక్షన్ గ్రూప్ చైర్మన్ కల్వలా రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ కార్యక్రమ రూపకర్త, గాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అయిన ప్రసాద్ తోటకూర శ్రమ ఫలితమే ఈ మొక్కల పెంపకం అని ఆయన సేవల్ని కల్వలా రావు కొనియాడారు. పారిస్ ఉగ్రదాడుల మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ నిర్వాహకులు నివాళులు అర్పించారు. పారిస్ దాడుల మృతులకు ప్రసాద్ తోటకూర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మొక్కల నాటకం కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వందల మంది వాలంటీర్లు టెక్సాస్ అర్లింగ్టన్ యూనివర్సిటీ విద్యార్థులు, మొక్కల స్పాన్సర్స్ గ్రూపు వారు  ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.


మరిన్ని వార్తలు