క్రీస్తుపై చెక్కుచెదరని గాంధీ లేఖ.. భారీ డిమాండ్‌

1 Mar, 2018 18:40 IST|Sakshi

వాషింగ్టన్‌ : జీసస్‌పై భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు మహాత్మాగాంధీ రాసిన లేఖకు భారీ డిమాండ్‌ పెరగనుంది. అమెరికాలోని పెన్సిల్వానియాలో ఇప్పుడు ఆ లేఖను వేలానికి పెట్టారు. దానికి ఇప్పుడు దాదాపు రూ. 32,63,250.00 (50 వేల డాలర్లు) రానున్నాయి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు 1926, ఏప్రిల్‌ 6న మహాత్మాగాంధీ ఈ లేఖ రాశారు.

ఒక రకమైన ఇంకుతో పెద్ద అక్షరాల్లో ఆయన ఈ లేఖను రాశారు. ఆయన సంతకం కూడా ఆ లేఖలో ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. పెన్సిల్వానియాకు చెందిన రాబ్‌ కలెక్షన్‌ అనే సంస్థ ఈ లేఖను సేకరించింది. ఈ లేఖలో ఏసు క్రీస్తు గురించి గాంధీ ఒక్క వాక్యంలో 'సహృదయంగల బోధకులందరిలో కెల్లా క్రీస్తు గొప్ప బోధకుడు' అని గాంధీ పేర్కొన్నారు. ఆయన ఈ లేఖను అమెరికాలోని తన మిత్రుడు మిల్టన్‌ న్యూబెర్రీ ఫ్రాన్ట్‌జ్‌కు రాశారు. గాంధీ రాసిన లేఖల్లోనే ఇది అత్యుత్తమమైన లేఖ అని రాబ్‌ కలెక్షన్‌ సంస్థ పేర్కొంది.

మరిన్ని వార్తలు