పార్లమెంటు భేటీకి సిరిసేన అంగీకారం

1 Nov, 2018 04:17 IST|Sakshi
మైత్రిపాల సిరిసేన

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును వచ్చే వారం సమావేశపర్చే అవకాశముందని స్పీకర్‌ కరు జయసూర్య కార్యాలయం తెలిపింది. దేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కారం కనుగొనాలని చేసిన సూచనకు అధ్యక్షుడు ఓకే చెప్పారు. శ్రీలంక కొత్త ప్రధానిగా రాజపక్స నియామకంపై అటార్నీ జనరల్‌ జె.జయసూర్య న్యాయసలహా ఇచ్చేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం అధికారం లేకపోయినప్పటికీ ప్రధాని విక్రమసింఘేను పదవి నుంచి సిరిసేన తప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. మరోవైపు రాజపక్సను కొత్త ప్రధానిగా చైనా, బురుండి తప్ప మరేదేశాలు అంగీకరించకపోగా, సిరిసేనపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది.

మరిన్ని వార్తలు