'నోబెల్' స్వీకరించిన కైలాస్, మలాలా

10 Dec, 2014 19:40 IST|Sakshi
'నోబెల్' స్వీకరించిన కైలాస్, మలాలా

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎనిమిదో భారతీయుడు కైలాస్. బాలల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.

బహుమతి కింద కైలాస్ సత్యార్థి, మలాలాకు నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేశారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు వెళ్లారు. ఓస్లోలో మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో కైలాస్ సత్యార్థి, మలాలా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు