చరిత్ర సృష్టించిన మలాలా

10 Oct, 2014 21:13 IST|Sakshi
చరిత్ర సృష్టించిన మలాలా

లండన్: అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్జాయ్ చరిత్ర సృష్టించారు.  భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. గతంలో విలియమ్ లారెన్స్ అనే భౌతిక శాస్త్రవేత్త 25 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి అందుకుని, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా మలాలా ఈ రికార్డను బద్దలు కొట్టారు.

కైలాశ్ సత్యార్థి,  మలాలా బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది.
 

>
మరిన్ని వార్తలు