జకీర్‌ నాయక్‌తో మనకూ ప్రమాదమే?!

19 Oct, 2017 19:48 IST|Sakshi

కౌలాలంపూర్‌ : వివాదస్పద ముస్లిం మత బోధకుడు జకీర్‌ నాయక్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని మలేషియాలోని మానవహక్కుల సంఘాలు కౌలాలంపూర్‌ హైకోర్టును అశ్రయించాయి. ప్రధానంగా మలేషియాలో జకీర్‌ నాయక్‌ శాశ్వత నివాస అనుమతి రద్దు చేయాలని 17 మానవ హక్కుల సంఘాలు కౌలాలంపూర్‌ హైకోర్టును కోరాయి. జకీర్‌ నాయక్‌పై భారత దేశంలో అనేక కేసులు నమోదవడంతో పాటు.. అక్కడి భారత దర్యాప్తు సంస్థలు అతన్ని వాంటెడ్‌ క్రిమినల్‌గా పేర్కొన్న విషయాన్ని.. మానవహక్కుల సంఘాలు కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ వల్ల మలేషియా భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని.. అందువల్ల అతనికి గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కోర్టును కోరింది.

మలేషియాలోని మలయా హక్కుల సంఘం నేతృత్వంలో ఏర్పడ్డ ఒక బృందం ఇది వరకే జకీర్‌ నాయక్‌పై దేశ బహిష్కరణ విధించాలని కోర్టులో కేసును పెట్టింది. ఈ కేసు ఈ నెల 21 కోర్టులో విచారణకు రానుంది. జకీర్‌ నాయక్‌కు చెందిన ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను భారత్‌ నిషేధించిన విషయాన్ని హక్కుల సంఘం కోర్టుకు తెలిపింది.

మరిన్ని వార్తలు