మలేసియా ప్రధాని అనూహ్య రాజీనామా

24 Feb, 2020 12:16 IST|Sakshi
మలేసియా ప్రధాని మహతీర్ మొహమాద్ (ఫైల్‌ ఫోటో)

కౌలాలంపూర్‌: మలేసియా ప్రధానమంత్రి అనూహ్యంగా పదవినుంచి తప్పుకున్నారు. ప్రధాని మహతీర్ మొహమాద్ (94)తన రాజీనామాను ఆ దేశ రాజుకు సమర్పించినట్టు సమాచారం.  దీనిపై స్పందించడానికి ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినప్పటికీ త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు మాత్రం వెల్లడించారు. ఇటీవల నెలకొన్ని రాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేయనున్నారన్న అంచనాల మధ్య ప్రధాని రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.  

2018,  మేలో  మలేసియా మహతీర్‌ ప్రధానిగా  రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు