ముగిసిన మాలి ఆపరేషన్

20 Nov, 2015 21:56 IST|Sakshi
ముగిసిన మాలి ఆపరేషన్

మాలి: మాలి రాజధాని బొమాకోలో ఉగ్రవాదుల వేట ముగిసింది. బొమాకోలోని హోటల్లోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను మాలి సైన్యం మట్టుబెట్టింది. అమెరికా, ఫ్రాన్స్ సైన్యం కూడా వారికి తోడుకావడంతో ఉగ్రవాదుల ఆటకట్టించడం కాస్త తేలికైంది. అయితే, ఈ ఆపరేషన్ మాత్రం కాస్త విషాదాన్ని మిగిల్చింది.

దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న 18 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది భారతీయులు మాత్రం క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. హోటల్ లో మరెవరూ బందీలుగా లేరని మాలి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దాదాపు 24గంటల తర్వాత ఈ ఆపరేషన్ ముగిసినట్లయింది.

మరిన్ని వార్తలు