స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్‌చిత్రాలు చూస్తున్నారా..!

17 May, 2016 19:48 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్‌చిత్రాలు చూస్తున్నారా..!

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ చిత్రాలు చూస్తారా? వాటిని చూసేందుకు పోర్న్‌ యాప్స్‌ ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారా? అయితే మీ స్మార్ట్‌ఫోన్‌ కు మాల్వేర్‌ (సాఫ్ట్‌వేర్ వైరస్‌)తో పెద్ద ముప్పే పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. పోర్న్ చూసేందుకు ఉపయోగించే యాప్స్‌లో ఉన్న వైరస్‌ మొబైల్‌ డివైస్‌లోకి దూరే అవకాశముందని, దాంతో మీ మొబైల్ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారంతోపాటు మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దొంగలించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. (చదవండి: మనోళ్లు 'దేశీ పోర్న్‌'ను తెగ చూసేస్తున్నారు!)


పోర్న్ చిత్రాలు చూసేటప్పుడు కనిపించే లింక్స్‌, వచ్చే టెక్ట్స్‌ మెసేజెస్‌ను ఓపెన్‌ చేసినా, క్లిక్ చేసినా ఈ పోర్న్ యాప్‌లు మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయ్యే అవకాశముందని, ఒక్కసారి వీటిని తొలగించడం చాలా కష్టమని, ఈ యాప్స్‌  మీ ఫోన్‌లోని సమస్త సమచారాన్ని ఊడ్చేస్తాయని నిపుణులు అంటున్నారు. థర్డ్‌ పార్టీ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ అయ్యే పోర్న్ థీమ్‌డ్‌ యాప్స్‌ చాలా ప్రమాదకరమైనవని, ఇందులోని మాల్వేర్‌ తమంతట తామే ఫోన్‌ను లాక్‌ చేస్తుందని, వీటిని తొలగించడం కూడా కష్టమేనని డెల్ సెక్యూరిటీ రీసెర్చర్‌ అలెక్స్ డుబ్రోవ్‌స్కీ తెలిపారు. (చదవండి: ప్లాట్లుగా పోర్న్‌ స్టూడియో.. వద్దంటున్న జనం!)


అయితే, ఇలాంటి యాప్స్‌ గుర్తించడం ప్రస్తుతం చాలా సులభమని, యాక్సెస్ కోసం ఈ యాప్స్‌ డివైజ్ అడ్మినిస్ట్రేటర్‌ను కోరినప్పుడే వీటిని గుర్తించవచ్చునని చెప్పారు. మాల్వేర్ తో అనుమానాస్పదంగా ఉన్న 100కు పైగా ఉన్న యాప్స్‌ను ఇప్పటివరకు గుర్తించడం జరిగిందని, వీటిని రూపకర్తలు పెద్ద ఎత్తున మొబైల్ వినియోగదారులపై దాడులు చేసి.. వ్యక్తిగత సమాచారాన్నికొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. పోర్న్‌ సంబంధిత యాప్స్‌లోనే ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉందని, ఇలాంటి యాప్స్‌ పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ రైట్స్‌ను కోరుతాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. కిట్‌కాట్‌ 4.4, అంతకుపూర్వం అండ్రాయిడ్‌ వెర్షన్ మొబైల్ ఫోన్లలో ఈ ముప్పు మరింత అధికమని అలెక్స్‌ పేర్కొన్నారు. లాక్ స్క్రీన్ మాల్వేర్‌తో వస్తున్న యాప్స్‌ దాడులు పెరిగిపోతుండటం ప్రస్తుతం ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నదని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు