నేటి నుంచి బంగ్లా పర్యటన

6 Jun, 2015 04:02 IST|Sakshi
నేటి నుంచి బంగ్లా పర్యటన

మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
ఢాకా: తొలిసారి తమ దేశంలో పర్యటించున్న  భారత ప్రధాని నరేంద్రమోదీకి ఎర్ర తివాచీ పరిచేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. దేశ రాజధాని ఢాకాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఢాకాలో  మోదీ నిలువెత్తు కటౌట్లు పెట్టారు. హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢాకా వరకు 14 కి.మీ పొడవున హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

మోదీతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రె హ్మాన్ నిలువెత్తు చిత్ర పటాలను కూడా ఏర్పాటు చేశారు. శనివారం నుంచి రెండ్రోజులపాటు సాగనున్న మోదీ పర్యటనలో ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి.

ఇందులో సరిహద్దు ఒప్పందం అత్యంత ప్రధానమైంది. దీనిపై మోదీ, మమత సమక్షంలో రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.  ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని హసీనా, మోదీ చర్చిస్తారు. అనంతరం కోల్‌కతా-ఢాకా-అగర్తల, ఢాకా-షిల్లాంగ్-గువాహటి బస్సు సర్వీసులను వారిరువురు జెండా ఊపి ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు