గన్‌ సేఫ్టీపై చర్చిస్తూనే.. చర్చిలో కాల్పులు

18 Nov, 2017 09:57 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో జనరల్‌గా నిర్వహించుకునే థాంక్స్‌ గివింగ్‌ మీల్‌  అనుకోని ప్రమాదానికి దారితీసింది. ఇటీవల టెక్సాస్‌ చర్చిలో జరిగిన కాల్పుల  దుర‍్ఘటన నింపిన విషాదాన్ని తలుచుకుంటూ ఉండగా..మరో  ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.  పెరుగుతున్న గన్‌ కల్చర్‌, ముఖ్యంగా చర్చిలో జరుగుతున్న  కాల్పులు, హింసపై  అక్కడ కొంతమంది  పెద్ద వాళ్లు( సీనియర్‌ సిటిజన్స్‌)  చర్చిలో  సమావేశమయ్యారు. మృతులకు నివాళులర్పించిన అనంతరం కాల్పులు, తదనంతర పరిణామాలు, గన్‌ సేఫ్టీపై చర్చించుకుంటున్నారు.  కానీ  తామూ తుపాకి కాల్పుల బాధితులమవుతామని...ఆ ఆహ్లాదకరమైన మధ్యాహ్నం ..భయంకరమైన మలుపు తిరుగుతుందని   అస్సలు ఊహించలేదు వారిలో ఓ వృద్ధ జంట.  ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల శరీరంలోకి  దూసుకుపోయాయి.

వివరాల్లోకి  వెడితే.. న్యూయార్క్‌లోని ఈస్ట్‌ టెన్నెసీ చర్చ్‌లో థాంక్స్‌ గివింగ్‌ విందును ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 మంది సీనియర్‌ సిటిజన్లు ఈ విందు హాజరయ్యారు. వారిలో యునైటెడ్ మెథడిస్ట్ చర్చి  సభ్యుడు పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్న తుపాకిని చూపించి, దాని వాడాలో అక్కడున్న వారికి వివరించాడు. 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్‌ గన్‌ను ఓపెన్‌ చేసి ,మ్యాగజైన్‌ లోడ్‌ చేసి అక్కడున్నవారికి చూపించాడు.  దాన్ని అలాగే  పక్కన పెట్టాడు. ఇంతలో మరో సభ్యుడు తనకూ చూపించమంటూ..వెంటనే ట్రిగ్గర్‌ నొక్కాడు. అంతే క్షణాల్లో  బుల్లెట్‌  పెద్దాయన  అరచేతిలోంచి...పక్కనే వీల్‌ చైర్‌లో కూర్చుని  వున్న భార్య (80)  పొట్ట, ముంజేతిలోకి  దూసుకుపోయింది.

అయితే  ప్రమాదవశాత్తూ జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన భార్యాభర్తలిద్దరి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనీ, ఎవరిమీదా కేసు నమోదు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి  రుస్‌ పార్క్స్‌ తెలిపారు. ఇటీవలి మాస్‌ షూటింగ్‌ నేపథ్యంలో  స్థానిక  చర్చిలలో సెమినార్లు నిర్వహించాలని కౌంటీ షెరీఫ్ విభాగం  నిర్ణయించడంతో వీరు కూడా సమావేశమయ్యారని తెలిపారు.

కాగా టెక్సాస్‌లోని చిన్నపట్టణం విల్సన్ కంట్రీలోని సుదెర్‌ల్యాండ్‌లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు