అధ్య‌క్షుడితో వీడియో కాన్ఫ‌రెన్స్‌: న‌గ్నంగా ప్ర‌త్య‌క్షం

18 May, 2020 16:42 IST|Sakshi

బ్రెసీలియా: లాక్‌డౌన్ వల్ల అనేక రంగాల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. అధికారులు సైతం ఇళ్ల‌లో నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా స‌మీక్ష‌లు జరుపుతున్నారు.‌ అయితే ఇలాంటి స‌మ‌యాల్లో కొన్ని చిత్ర‌విచిత్ర సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయి. తాజాగా దేశాధ్య‌క్షునికి సైతం ఓ చేదు అనుభ‌వం ఎదురైంది.‌ వివ‌రాల్లోకి వెళితే..  క‌రోనా క‌ట్టడిలో భాగంగా అనుస‌రిస్తున్న లాక్‌డౌన్ ఫ‌లితాల‌పై చ‌ర్చిందుకు సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వ‌హించాడు. ఇందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్స‌నారోతో పాటు ప‌ది మంది ఇత‌ర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంత‌లోనే ఆ వీడియో కాల్‌లో ఓ వ్య‌క్తి న‌గ్నంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. (బొల్సొనారో ఆసుపత్రికి వెళ్లింది అందుకేనా !)

దీంతో ఖంగు తిన్న అధ్య‌క్ష‌డు జైల్ బొల్సనారో.. "పాలో, ఈ కాల్‌లో చివర్లో ఉన్న వ్య‌క్తి బాగానే ఉన్నాడు క‌దా?" అని అనుమానాన్ని వెలిబుచ్చాడు. వెంట‌నే ఇత‌ర అధికారులు స‌ద‌రు వ్య‌క్తిని కాన్ఫ‌రెన్స్‌ నుంచి తొల‌గించారు. ఈ వీడియో గురించి ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పాలో గ్యూడ్స్‌ మాట్లాడుతూ.. "అత‌ను న‌గ్నంగా స్నానం చేస్తున్నాడు. ఈ మీటింగ్ వేడి వేడిగా జ‌రుగుతోంది. అందుకని అత‌ను చ‌న్నీళ్లతో స్నానం చేస్తున్నాడు" అని చ‌మ‌త్కరించారు. కాగా ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌కు సంబంధించిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా ఏప్రిల్‌లోనూ ఓ బ్రెజిల్ జ‌డ్జి చొక్కా వేసుకోకుండా వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్‌)

మరిన్ని వార్తలు