అతని జవాబు విని పోలీసులు షాక్‌..!

31 Mar, 2020 08:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: ప్రపంచంతో పాటు అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్‌ వార్తల్ని పక్కనబెడితే.. అమెరికా పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులు నిశ్చేష్టులయ్యారు. 51 ఏళ్ల ఆల్బర్ట్‌ టిట్లో అనే వ్యక్తి కుక్కను డ్రైవింగ్‌ సీట్లో పెట్టి.. తాను ప్యాసెంజర్‌ సీట్లో కూర్చుని కారును ఏకంగా గంటకు 160 కి.మీ వేగంతో తోలాడు. దీంతో ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌కు కొందరు ఫోన్‌ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన దక్షిణ సీటెల్‌లో గత ఆదివారం చోటుచేసుకుంది. 
(చదవండి: కరోనాకు 35,349 మంది బలి)

‘పదేళ్లుగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. అధిక వేగంతో బండి నడిపి.. వారు చెప్పే సాకులు తెలుసు. కానీ, ఇతగాడు చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యాను. ఎందుకంత వేగంగా కారు నడిపావ్‌ అని ప్రశ్నిస్తే.. కుక్కకు డ్రైవింగ్‌ నేర్పిస్తున్నా! అని చెప్పడంతో దిమ్మ తిరిగిపోయింది. ఇలాంటి వాళ్లను అస్సలు క్షమించకూడదు. అంత ఎత్తున్న ఆ శునకాన్ని షెల్టర్‌లో పెట్టాం. నిందితుడిపై డ్రగ్స్‌, మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశాం’అని పోలీస్‌ అధికారి హెథర్‌ ఆక్స్ట్‌మాన్‌ చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా కరోనా క్రోధానికి బలవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి దేశం మొత్తంమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడగా.. 2,606 మంది ప్రాణాలు కోల్పోయారు.  4,574 మంది కోలుకున్నారు. 
(చదవండి: కరోనా: గుడ్‌న్యూస్‌ చెప్పిన జర్నలిస్టు)

మరిన్ని వార్తలు